వివి వినాయక్ సినిమాలో హీరోగా సాయి ధరమ్ తేజ్
- June 20, 2017
వివి వినాయక్ కొత్త సినిమా ఫిక్సయ్యింది. హీరో సాయిధరమ్ తేజతో ఓ సినిమా చేయాలని డిసైడయ్యాడు. సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. వినాయక్ మెగా కాంపౌడ్ దర్శకుడు. మెగా హీరోలతో ఆయనది సూపర్ కాంబినేషన్. . చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్‌లతో సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు. మెగా 150తో మరో సూపర్ హిట్ ఇచ్చి మెగా అభిమానులకు మరింత చేరువైన దర్శకుడు. ఇప్పుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం జవాన్ సినిమాతో బిజీగా వున్నాడు. బి.వి.ఎస్.రవి దర్శకుడు. దేశానికి జవాన్ ఎంత అవసరమో.. మన ఇంటికి సమస్యలొస్తే వాటిని ఎదుర్కోవడానికి కూడా అలాంటి ఒకరు అవసరమని చెప్పే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







