పుష్కలమైన థ్రిల్లింగ్ అంశాలతో జులై 14 న రానున్న 'శమంతక మణి'
- June 21, 2017
నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, డా. రాజేంద్ర ప్రసాద్, కాంబినేషన్ లో రూపొందుతున్న 'శమంతక మణి' చిత్రం జులై 14 న విడుదలకు సిద్ధమవుతోంది. 'భలే మంచి రోజు' ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో భవ్య క్రియేషన్స్ పతాకం పై v. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ సందర్భం గా నిర్మాత v .ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - "హీరోలుగా చాలా బిజీ గా ఉన్న నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ఈ మల్టీ స్టారర్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే , ఈ కథలో ఉన్న దమ్ము ఏంటో అర్థమవుతోంది. ఎవరూ ఊహించని మలుపులతో , పుష్కలమైన థ్రిల్లింగ్ అంశాలతో ఉన్న ఈ సినిమా కచ్చితంగా క్లాస్ నీ , మాస్ నీ, ఆకట్టుకుంటుంది. పురాణాల్లో పాపులరైన 'శమంతకమణి' గురించిన కథ కాదు ఇది. అసలు ఈ 'శమంతకమణి' ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది." అని తెలిపారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ - 'ఇందులో నారా రోహిత్ పాత్ర పేరు ఇనస్పెక్టర్ రంజిత్ కుమార్ . ఇంతకుముందు ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ పేరుతో పోలీస్ పాత్రలు చేసి సెన్సేషన్ సృష్టించారు. నారా రోహిత్, పాత్ర చిత్రణ , ఆటిట్యూడ్ చాలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక సుధీర్ బాబు చేసిన కృష్ణ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది.కార్తీక్ పాత్రలో నటించిన ఆది మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. కోటిపల్లి శివగా సందీప్ కిషన్ మంచి మాస్ పాత్ర పోషించారు. ఈ నలుగురి పాత్రల మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది. కానీ వీరు నలుగురూ కలుసుకునే సందర్భం , వీళ్ళ మధ్య నడిచే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగానూ ఉంటాయి. " అని చెప్పారు.
చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ళ భరణి, హేమ, సురేఖ వాణి, సత్యం రాజేష్, బెనర్జీ, అదుర్స్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం :మణిశర్మ,కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్స్: వివేక్ అన్నామలై, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







