సిరియాలో అసద్ తొలగింపు పై తగ్గినా ప్రాధాన్యత
- June 23, 2017
- అంశానికి తగ్గిన ప్రాధాన్యత
ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్
సిరియాలో గత ఆరేళ్లుగాకొనసాగుతున్న అంతర్యుద్ధానికి పరిష్కారం కోసం అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తొలగించే అంశానికి ఇప్పుడు తమ దృష్టిలో ప్రాధాన్యత తగ్గిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సిరియాపై తాము అనుసరించనున్న వైఖరిని తొలిసారిగా అధికారికంగా వెల్లడించారు. 2011లో సిరియన్ అధ్యక్షుడిపై వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితుల్లో ఆయన్ను గద్దె దింపాలన్న అంతర్జాతీయ సమాజ లక్ష్యం ఇప్పుడు సంక్లిష్టంగా మారుతోందన్నారు. ప్రతి సమస్యకూ ముందు అసద్ సర్కారును గద్దె దింపాలని తానెన్నడూ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. అసద్‌ను గద్దెదింపితే ఆయన వారసుడెవరన్న విషయాన్ని ఎవరూ తనకు చెప్పకపోవటమే ఇందుకు కారణమని మాక్రాన్ వివరించారు.
సిరియాలో ఇప్పుడు తమకు రెండు ప్రాధాన్యతలున్నాయని ఆయన వివరించారు. ఇందులో మొదటిది ఉగ్రవాద గ్రూపులతో రాజీ లేని పోరాటమని, ఈ లక్ష్య సాధనలో తాము రష్యాతో సహా ప్రతి ఒక్కరి సాయాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇక సిరియాలో రాజకీయ సుస్థిరత సాధించటం రెండో అంశమని, తాను విఫల ప్రభుత్వాన్ని ఎప్పుడూ కోరుకోవటం లేదని ఆయన వివరించారు. సిరియా సంక్షోభాన్ని కేవలం సైనిక బలప్రయోగంతో మాత్రమే పరిష్కరించగలమని భావించటంద్వారా అంతర్జాతీయ సమాజం తీవ్ర తప్పిదాన్ని చేస్తోందన్నారు. సిరియా సమస్య పరిష్కారానికి రాజకీయ, దౌత్య విధానాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. అయితే శత్రువులను మట్టుపెట్టటానికి సిరియా సైన్యం రసాయనిక ఆయుధాలను ఉపయోగించటం సరికాదని, ఇది మానవతాసూత్రాలను ఉల్లంఘించటమేనని ఆయన అన్నారు
ప్రతిపక్షం అసంతృప్తి
కాగా సిరియా సంక్షోభంపై మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి ప్రతిపక్షం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాక్రాన్ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌కు సిగ్గు చేటయిన విషయమని, మానవాళికి శత్రువైన బషర్‌ను మాక్రాన్ తన శత్రువుగాచూడకపోవటం విడ్డూరంగా వుందని ప్రతిపక్ష గ్రూపులకు చెందిన సిరియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అహ్మద్ రమదాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది నైతికత్వానికి, మానవతకు తీరని విషాదమని ఆయన వ్యాఖ్యానించారు. మాక్రాన్ వ్యాఖ్యలు తమకు విస్మయం కలిగించాయని కౌన్సిల్‌లోని మరో సభ్యుడు ఖాలిద్ ఖోజా వ్యాఖ్యానించారు. బ్రిటన్, టర్కీ, కతార్‌లతో పాటు ఫ్రాన్స్ తదితరదేశాలను కూడా తాము మిత్రదేశాలుగా భావించామని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







