భాగ్యనగరంలో ఐఎస్ ఉగ్రవాది అరెస్టు
- June 24, 2017
తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్రపన్నిన ఐఎస్ ఉగ్రవాదిని హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడిపేరు కొనకళ్ల సుబ్రమణ్యం అలియాస్ ఒమర్ (22). కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన సుబ్రమణ్యం ఇస్లాంవైపు ఆకర్షితుడై 2014లో మతం మార్చుకున్నాడు. శ్రీనగర్, ఉమ్రాబాద్, తమిళనాడులోని అంబుర్, ముంబై తదితర ప్రాంతాలు తిరుగుతూ మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి ఐఎస్ మాడ్యూల్స్‌తో పరిచయమైంది. ముంబైఐఎస్ మాడ్యూల్‌కు చెందిన అబు కుఫ్హా ఆల్-హిందీతో టెలిగ్రామ్ద్వారా తరచూ సంభాషిస్తూ దేశంలో మారణహోమం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఐఎస్ మాడ్యూళ్లపై నిఘా పెట్టిన పోలీసులకు సుబ్రమణ్యం వివరాలు కూడా తెలిశాయి. వారు అతడిపై నిఘాను కొనసాగించారు. అతడు విధ్వంస కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు..హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఒమర్ వారంరోజుల క్రితం రాజధానికి చేరాడు. టోలిచౌకిలోని సోఫియా రెసిడెన్సీ మూడో అంతస్తు రూమ్ నెంబరు 302లో అమర్ అనే అంగవికలుడి వద్ద వంటమనిషిగా చేరాడు. రెండు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన ఒమర్ తిరిగి రాకపోవటంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే..
సిట్ ఏసీపీ డి.హరికుమార్ యాదవ్,ఇన్స్పెక్టర్ కె.శ్యామలరావు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఒమర్‌ను అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు. శిక్షణ కోసం దేశం దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఒమర్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా.. ఒక హిందువు మతం మార్చుకుని దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్ని, అరెస్టు కావడం సంచలనం సృష్టించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







