'ఏజంట్ భైరవ' జూలై 7న విడుదల
- June 27, 2017
పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ విజయ్ నటించిన 'ఏజంట్ భైరవ' ట్రైలర్‌ని రీసెంట్‌గా విజయ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశాము. ప్రేక్షకుల నుండి ఈ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో మా హీరో విజయ్‌కి తెలుగులో మంచి హిట్‌ని అందుకుంటాడని, అలాగే మా బ్యానర్ మంచి హిట్ వస్తుందని ఆశిస్తున్నాము.
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, కీర్తిసురేష్‌ల నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రాన్ని జూలై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..' అన్నారు.
విజయ్, కీర్తిసురేష్, జగపతిబాబు, సతీష్, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్ బాలాజీ, ఆపర్ణ వినోద్, పాప్రీ గోష్, హరిష్ ఉత్తమున్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎమ్. సుకుమార్, ఫైట్స్: అనల్ అరసు, ఆర్ట్: ఎమ్. ప్రభాకరన్, ఎడిటింగ్: ప్రవీణ్. కె. ఎల్, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-దర్శకత్వం: భరతన్.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







