అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్యకు మోడీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- June 27, 2017
అమెరికా పర్యటన నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్రమోడీకి అక్కడ ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష దంపతులు సహా అమెరికా వైట్ హైజ్ వర్గాలు మోడీకి సాదరంగా ఆహ్వానం పలికాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వైట్ హౌజ్ లో మోడీకి విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా మోడీ.. అమెరికా అధ్యక్ష దంపతులకు చిరు కానుకలు ఇవ్వడం విశేషం. అమెరికా ప్రఖ్యాత అధ్యక్షుడు అబ్రహం లింకన్ శత వర్దంతి సందర్భంగా.. 1965లొ భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒరిజినల్ స్టాంపును ట్రంప్ కు మోడీ అందించారు. ఇదే విషయాన్ని భారత పీఎంవో వర్గాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. దీనికి సంబంధించి పీఎంవో వర్గాలు ట్విట్టర్లో పెట్టిన పోస్టులో.. భారత జాతిపిత గాంధీ, లింకన్.. ఇద్దరూ ఒకే తరహా ఆదర్శాలు కలవారని పేర్కొంది.
ఇక ట్రంప్ భార్య మెలానియాకు హిమాచల్ ప్రదేశ్‌లో తయారుచేసిన వెండి బ్రాస్లెట్, టీ, కాంగ్రా ప్రాంతానికి చెందిన తేనే, జమ్మూ కశ్మీర్ ,హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన హ్యాండ్ వోవెన్ షాల్స్‌ను మోడీ బహుమతిగా అందించారు. ఇందుకు ప్రతిగా ట్రంప్ అమెరికా శ్వేతసౌధం టూర్ గైడ్‌ను మోడీకి అందించారు. ఇందులో అబ్రహం లింకన్ బెడ్రూమ్ వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







