నాని మూడో డ్యూయల్ రోల్
- June 28, 2017
నిన్నటితరం హీరోలు ద్విపాత్రభినయం చేసిన సందర్భాలు ఎక్కువే. అయితే ఈ జనరేషన్ హీరోలు మాత్రం అలాంటి పాత్రలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అయితే ఈ జనరేషన్ లో కూడా ఒకరిద్దరు తారలు డ్యుయల్ రోల్ లో అలరిస్తున్నారు. ఈ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. వరుస సక్సెస్ లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నాని ప్రయోగాలకు కూడా ముందే ఉంటున్నాడు.
తొలిసారిగా జెండాపై కపిరాజు సినిమాలో డ్యుయల్ రోల్ లో కనిపించాడు నాని. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మన్ సినిమా కోసం మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే రిస్క్ కు రెడీ అవుతున్నాడు నాని.
త్వరలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. ఈ సినిమాలో మరోసారి డ్యుయల్ రోల్ లో నటించేందుకు ఓకె చెప్పాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నిన్నుకోరి, ఎమ్ సీఏ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







