మొదలైన అమర్నాథ్ యాత్ర
- June 28, 2017
జమ్ముకశ్మీర్లోని దక్షిణ పర్వత ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం 5గంటల ప్రాంతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మల్సింగ్ జెండా వూపి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. జమ్ము బేస్ క్యాంపు వద్ద తొలి బృందంలో 2,280మంది భక్తులు యాత్రకు బయల్దేరారు. 40 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి 2.3లక్షలకు పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈసారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గలు హెచ్చరించాయి. 100 నుంచి 150 మంది భక్తులు, 100 మంది పోలీసులను అంతమొందించాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ రాసిన లేఖ సోషల్మీడియాలో ప్రత్యక్షమైంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. యాత్రకు దాదాపు 35వేల మంది పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర ఆగస్టు 7న ముగియనుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







