పిబిబివై ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ సులభతరం
- June 28, 2017
ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ (ఇసిఆర్) ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్, ప్రవాసీ భారతీయ భీమా యోజన (పిబిబివై) పేరుతో ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకోవడం తప్పనిసరి. 10 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ విభాగంలో. పనికి సంబంధించిన మరణం, లేదంటే శాశ్వత అంగవైకల్యం ఎమిగ్రేంట్కి కలిగితే, ఈ మొత్తాన్ని సంబంధీకులకు అందజేస్తారు. అలాగే ఈ ఇన్స్యూరెన్స్ కింద 75,000 రూపాయల వరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం వినియోగించవచ్చు. మెటర్నిటీ బెనిఫిట్ కింద 25,000 వరకూ, లీగల్ ఖర్చుల కింద 30,000 వరకూ లబ్ది పొందే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కి సంబంధించి ఇప్పటిదాకా నామినీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మరింత సులభతరంగా క్లెయిమ్ ప్రాసెస్‌ని అందుబాటులోకి వచ్చింది. ఇ-మైగ్రేట్ సిస్టమ్ ద్వారా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. పిబిబివై కింద క్లెయిమ్స్‌ని డైరెక్ట్‌గా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలు పరిష్కరించనున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







