ఖతారీ డిమాండ్స్‌పై మరో ఆలోచనలేదు: సౌదీ ఫైనాన్స్ మినిస్టర్
- June 28, 2017
జెడ్డా, వాషింగ్టన్: తీవ్రవాదానికి సహకరించే చర్యలను ఆపాలంటూ ఇప్పటికే ఖతార్‌పై సౌదీ అరేబియా సహా పలు దేశాలు మండిపడుతున్న సంగతి తెలిసినదే. ఖతార్‌తో ఆయా దేశాలు సంబంధాల్ని తెంచుకున్నాయి. ఈ విషయంలో ఇంకో ఆలోచన లేదని సౌదీ అరేబియా ఇంకోసారి స్పష్టం చేసింది. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాల్ని అందిస్తున్న ఖతార్ విషయంలో తాము తెరపైకి తెచ్చిన డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గబోమని సౌదీ ఫారిన్ మినిస్టర్ అదెల్ అల్ జుబైర్ స్పష్టం చేశారు. మొత్తం తాము ఖతార్ ముందుంచిన 13 డిమాండ్లలో అల్ జజీరా మూసివేత సహా చాలా అంశాలున్నాయి. యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిలెర్సన్, ఖతార్ ఫారిన్ మినిస్టర్‌తో గల్ఫ్ స్టేట్స్ సంక్షోభంపై చర్చలు జరిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు సౌదీ ఫారిన్ మినిస్టర్. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, బహ్రెయిన్ తదితర దేశాలు జూన్ 5న, ఖతార్‌తో అన్ని సంబంధాల్నీ తెంచుకున్నట్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







