బ్రేస్‌లెట్‌తో ఓ మహిళ జీవితం నరకంగా మారిన వైనం
- June 28, 2017
కళ్లు తిరిగే రేటు అని మాట వరుసకు వింటుంటాం. కానీ చైనాలో ఓ మహిళ నిజంగానే బ్రేస్లెట్ ధర విని కళ్లు తేలేసింది. ఎరక్కపోయి బ్రేస్‌లెట్‌ను చేతికి పెట్టుకున్న పాపానికి ఇప్పుడు జీవితాంతం బాధ పడాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంది.
యునాన్ ప్రావిన్స్‌లోని రూయిలి నగరంలో షాపింగ్‌కు వెళ్లింది సోఫీ అనే మహిళ. అక్కడ జేడ్ బ్రాండ్‌కి చెందిన ఓ బ్రేస్లెట్ సోఫీకి ఎంతో నచ్చింది. అది తన చేతికి ఎలా ఉంటుందో చూద్దామనుకునేలోపు.. అది కాస్తా కిందపడి పగిలిపోయింది.
దాని ధరను విచారించగా.. సుమారు 28 లక్షలని షాపు యజమాని తెలిపాడు. అది వినగానే సోఫీ షాప్‌లోనే స్పృహతప్పి పడిపోయింది. దాంతో అక్కడున్నవారంతా ఆమెకు దగ్గరుండి సపర్యలు చేశారు. కొన్ని గంటల వరకు ఆమె స్పృహలోకి రాలేదు. విషయం తెలిసి సోఫీ కుటుంబసభ్యులు షాపుకు వచ్చి.. యజమానికి 6 లక్షలు ఇచ్చారు. కానీ డబ్బు మొత్తం కట్టాల్సిందేనని యజమాని గొడవకు దిగాడు. ఇక చేసేదేంలేక.. వాయిదాల్లో డబ్బు చెల్లించడానికి ఒప్పుకోవడంతో యజమాని శాంతించాడు. మొత్తమ్మీద పొరబాటున బ్రేస్‌లెట్‌ను చేతికి పెట్టుకున్న పాపానికి సోఫీ ఇప్పుడు జీవితాంతం చింతించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







