జూలై 1 నుంచి పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి
- June 28, 2017
పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు నంబర్ లేదా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినపుడు కేటాయించిన గుర్తింపు నంబర్ అయినా పేర్కొనాలి. జూలై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్‌లు ఫైల్ చేసేందుకూ పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని ఐటి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. పాన్ కార్డుల జారీ, ఐటిఆర్‌ల ఫైలింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఐటి చట్టంలో చేసిన మార్పులను సుప్రీం కోర్టు ఇటీవల సమర్ధించింది. దీంతో జూలై 1 నుంచి పాన్ నంబర్ కోసం చేసే దరఖాస్తుల్లోనూ ఆధార్ నంబర్ పేర్కొనాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







