శృతి హాసన్ స్థానాన్ని భర్తీ చేయనున్న హన్సిక..!
- June 29, 2017
బాహుబలి చిత్రం తర్వాత ఎపిక్ మూవీల హడావిడి పెరిగింది. మహా భారతం, రామాయణం లాంటి చిత్రాలు త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుండగా, సుందర్ సి పలు భాషలలో సంఘమిత్ర అనే టైటిల్ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. జయం రవి, ఆర్య ప్రధాన పాత్రలలో రూపొందనున్న ఈ చిత్రంలో శృతి హాసన్ ని కూడా మెయిన్ రోల్ కి ఎంపిక చేయగా, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుండి తాను తప్పుకుంటున్నట్టు శృతి ప్రకటించింది. సంఘమిత్ర చిత్రంలో శృతి పాత్ర యువరాణి కాగా ఈ సినిమా కోసం కత్తి విన్యాసాలు, గుర్రపు స్వారీలు, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. అయితే సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకోవడంతో ఆ పాత్రని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది..
యువరాణి పాత్రలో కనిపించాలంటే తప్పక విన్యాసాలు రావలసి ఉంది కాబట్టి గతంలో వాటిపై పట్టు ఉన్న భామలని తీసుకోవాలని నిర్మాతలు భావించారు. ఆ మధ్య నయనతార, అనుష్క పేర్లు వినిపించిన చివరికి హన్సికనే ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సుందర్ దర్శకత్వంలో హన్సిక చంద్రకళ, కళావతి అనే సినిమాలు చేయగా, ఇప్పుడు సంఘమిత్రలోను ఈ అమ్మడినే ఫైనల్ చేస్తారనే టాక్ నడుస్తుంది. మరోవైపు 'సంఘమిత్ర' చిత్రంలో నటించాలన్న ఆకాంక్షను నీతు చంద్ర వెల్లడించింది. నర్తకి, వీరనారి సంఘమిత్ర పాత్రలో హన్సిక నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







