ఎయిర్ ఇండియా రేసులో ఇండిగో
- June 29, 2017
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయివేటు ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న ఎయిర్ ఇండియాపై దేశీయ ఎయిర్‌లైన్స్ , బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇండిగో లేఖ రాసినట్టు సమాచారం.
ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినెట్ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో (24గం.ల్లోపే) అలా సంస్థలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగో ఈ రేసులో ముందు వరసలో ఉండటం విశేషం.
ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో ఆసక్తిగా ఉందని సెంట్రల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే గురువారం ప్రకటించారు. వీటితోపాటు ఇతర దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థల ద్వారా ఈ ఆఫర్లు కూడా అనధికారికంగా ప్రకటించాయని చెప్పారు. దీనిపై క్యాబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అలాగే టాటా గ్రూపు నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదన్నారు.
మరోవైపు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చని మీడియా నివేదికలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై టాటా ఇంకా స్పందించలేదు.కాగా ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం గత రాత్రి (బుధవారం) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







