మరో రెండు కొత్త ఫీచర్ల తో ముందుకు రానున్న వాట్సాప్
- June 29, 2017
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారుల కోసం తీసుకురాబోతోంది. 'ఇమోజీ సెర్చ్', 'వీడియో స్ట్రీమింగ్' సదుపాయాలను పరిచయం చేయబోతోంది.
చాలా మంది టెక్ట్స్ మెసేజ్ల కన్నా ఇమోజీల ద్వారానే తమ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇమోజీలను పంపడం మరింత సులభతరం చేసింది వాట్సాప్. ఇందుకోసం 'ఇమోజీ సెర్చ్'ను తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్ జీబోర్డ్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇమోజీ సెర్చ్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఇమోజీ ఐకాన్ను ఒత్తితే ఆ జాబితాతో పాటు సెర్చ్ బటన్ కూడా కనిపిస్తుంది. అందులో ఉదా: hand అని టైప్ చేస్తే చేతికి సంబంధించిన ఇమోజీలన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్లో ఉంది. త్వరలో వినయోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
ఇక ఐఫోన్ యూజర్లకు వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ను వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఎవరైనా పంపిన వీడియోను చూడాలనుకుంటే అది పూర్తిగా డౌన్లోడ్ అయ్యే వరకూ వేచి చూడాల్సి వచ్చేది. ఈ సరికొత్త ఫీచర్తో ఆ ఇబ్బంది లేదు. వీడియో డౌన్లోడ్ కాకుండానే స్ట్రీమింగ్ ద్వారా చూసుకోవచ్చు. ఇది కూడా బీటా దశలోనే ఉంది. త్వరలో ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







