ఇక ఆ వివాహాలు చట్టబద్దం
- June 30, 2017
జర్మనీలో స్వలింగ సంపర్కులు విజ యం సాధించారు. వారు పెళ్లిళ్లు చేసుకునేందుకు జర్మనీ పార్లమెంటు ఓకే చెప్పింది. గత కొద్ది రోజులు గా కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడిం ది. స్వలింగ సంపర్కుల వివాహం అంశంపై ప్రవేశ పెట్టిన బిల్లుకు జర్మనీ పార్లమెంటు ఆమోదం తెలి పింది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్‌తో సహా ఆమె పార్టీలోని పలువురు ఈ బిల్లును వ్యతిరేకించినా అది చట్టంగా రూపుదాల్చడం గమనార్హం. ఈ సంద ర్భంగా ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ 'స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు వ్యతిరేకంగా ఓటు వేశాను. నా దృష్టిలో పెళ్లి అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్యే జరగాలి. పార్లమెంటు..సమాజంలో మరింత మార్పు ను ఆశించిందేమో' అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జర్మనీ చట్టంలో కొత్తగా మార్పు చేసిన ప్రకారం 'ఒక స్త్రీ పురుషుడు, లేదా స్వలింగ వ్యక్తుల జీవితాల్లోకి వివాహం అడుగు పెట్టింది' అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. తాజాగా చేసిన చట్టం ద్వారా స్వలింగ సంపర్కులకు కేవలం వివాహ అవకాశం మాత్రమే కాకుండా పిల్లలను కూడా దత్తత తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇదివరకే జర్మనీ ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా దిగువ సభలో 393/226 ఓట్లతో బిల్లు నెగ్గింది. ఈ ఏడాది చివరినాటికి ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







