చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన మెస్సీ

- June 30, 2017 , by Maagulf
చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (30) ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యుల సమక్షంలో తన  చిన్ననాటి ప్రేయసి, సహజీవన భాగస్వామి ఆంటోనెల్లా రొకుజ్జోను మెస్సీ శుక్రవారం (జూన్‌ 30) పెళ్లాడాడు. సుమారు 250 మంది ప్రపంచ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో మెస్సీ... ఆంటోనెల్లా వేలికి వెడ్డింగ్‌ రింగ్‌ తొడిగి  వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.  మోస్సీ సొంత నగరం అత్యంత విలాసవంతమైన రొసారియో ఈ పెళ్లి వేడుకకు వేదిక అయింది.

కాగా గత పదేళ్లుగా మెస్సీ, ఆంటోనెల్లా రొకుజ్జో సహజీవనం చేస్తున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు (తియాగో, మాటియో మెస్సీ) కూడా ఉన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు హాలీవుడ్తో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాళ్లు నైమర్, లూయిస్ సువరేజ్ సహా పలువురు తన భార్యలతో కలిసి హాజరు అయ్యారు.

అలాగే  బార్సిలోనా స్టార్ గెరార్డ్ పికి, పాప్‌ గాయని షకీరా సైతం  విచ్చేశారు. ఇక వివాహ వేడుకలో  ప్రముఖ స్పెయిన్‌ డిజైనర్‌ రోసా క్లారా రూపొందించిన  సొగసైన డిజైనర్‌ గౌన్‌లో ఆంటోనెల్లా రొకుజ్జో మెరిపోయింది. పెళ్లి వేడుక అనంతరం ఈ జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కవరేజ్‌ కోసం 150మంది జర్నలిస్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రత్యక్షంగా కవరేజ్‌కు మాత్రం అనుమతించలేదు. ఈ వివాహ కార్యక్రమానికి సుమారు 400మందికి పైగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com