'ఖాకి' గా రానున్న కార్తి
- June 30, 2017
మ్యూజిక్ రంగంలో గత 20 ఏళ్లుగా విశేష సేవలందించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. తొలి ప్రయత్నంగా తమిళ చిత్రం ధీరణ్ అదిగరమ్ ఓండ్రు అనే సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నది. ఈ చిత్రం తెలుగులో ఖాకీ పేరుతో విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి ది పవర్ ఆఫ్ పోలీస్ అనేది ట్యాగ్‌లైన్. శతురంగ వెట్టై చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన కనిపిస్తున్నది.
పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో తెరకెక్కిన ఖాకీ చిత్రంపై ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ఎండీ ఉమేశ్ గుప్తా ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో గానీ, సెప్టెంబర్ తొలివారంలో గానీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలుగులో విజయం సాధించిన విక్రమార్కుడు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయగా అందులో కార్తీ నటించాడు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్నది. అదే మాదిరిగా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







