ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

- July 01, 2017 , by Maagulf
ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇండిగో విమానానికి బీఎస్‌ఎఫ్‌ విమానానికి మధ్య పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు అతి సమీపంలో నుంచి దూసుకెళ్లాయి. పైలట్లు అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం తప్పింది. బీఎస్‌ఎఫ్‌ విమానంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఉండటం మరింత భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఇండిగో సంస్థకు చెందిన అధికారిక ప్రతినిధి ధ్రువీకరించారు. వివరాల్లోకి వెళితే.. ఇండిగోకు చెందిన విమానం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి వస్తోంది.

అదే సమయంలో బీఎస్ఎఫ్‌కు చెందిన విమానం కూడా అదే మార్గంలో ఎగురుతోంది. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెరిషీ కూడా ఉన్నారు. తమ విమానం 26వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో బీఎస్‌ఎఫ్‌ విమానం 25వేల అడుగుల ఎత్తులో ఉందని, మరింత పైకి రావడం ప్రారంభించిందని ఇండిగో ప్రతినిధి చెప్పారు. దీనిని గుర్తించిన ఇండిగో పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారని, దీంతో ఏటీసీ వెంటనే బీఎస్‌ఎఫ్‌ విమానానికి  ప్రమాద సంకేతాలు పంపించడంతో ఊపిరిపీల్చుకున్నట్లయిందని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com