ఫేస్బుక్ లో కొత్త ఫీచర్
- July 01, 2017
సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్బుక్ ఆ అద్భుత ఫీచర్ అందుబాటులోకి రానుంది. అదేనండి ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఉచిత వైఫై సదుపాయం ఎక్కడ ఉందో ఎంచక్కా మీకు ఫేస్‌బుకే చెప్పేస్తోంది. దీని ద్వారా ఉచిత వైఫైను యూజర్లు వాడుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఎంపికచేసిన దేశాల్లో కేవలం ఐఓఎస్ మొబైల్ యూజర్లకు గతేడాది నుంచి అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందించడం ప్రారంభించింది ఫేస్బుక్.
తాము దీన్ని గతేడాది కొన్ని దేశాల్లో మాత్రమే లాంచ్ చేశామని, కేవలం ప్రయాణాలు చేసే వారికోసం మాత్రమే కాకుండా, డేటా అయిపోతుందని భయపడేవారి కోసం కూడా ఇక దీన్ని విస్తరిస్తున్నామని ఫేస్బుక్ ఇంజనీరింగ్ డైరెక్టర్ అలెక్స్ హిమెల్ చెప్పారు. '' ఫైన్డ్ వైఫై'' ఫీచర్ ద్వారా చుట్టుపక్కల ఎక్కడెక్కడ వైఫై హాట్ స్పాట్లు ఉన్నాయో సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. డేటా కనెక్షన్ బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే దగ్గర్లోని ఉచిత వైఫై కనెక్షన్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని అలెక్స్పేర్కొన్నారు. ఫైండ్ వైఫై హాట్స్పాట్ల కోసం ఫేస్బుక్ యాప్‌ను ఓపెన్ చేసి, ''మోర్'' ట్యాబ్‌ను క్లిక్‌చేస్తే, ''ఫైన్డ్ వైఫై''ఫీచర్ కనిపిస్తోంది. ఇక దాన్ని ఆన్ చేసుకుంటే చాలు, మ్యాప్‌లో దగ్గర్లోని హాట్స్పాట్లను యూజర్లు వాడుకోవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







