ఆస్త్మాకు కారణమయ్యే వాటికి దూరం..దూరం..
- October 16, 2015
ఆస్తమా (శ్వాస సంబంధిత సమస్య)ఒక క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇది శ్వాసక్రియకు చాలా ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్య . ఆస్తమా సమస్య ఉన్నవారిలో దినచర్య కూడా రోజు రోజుకి కష్టతరం అవుతుంది. ఆస్తమా సమస్య ఎక్కువ అయితే ప్రాణానికే చాలా ప్రమాదం. ఆస్తమా యొక్క లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి మారుతుంది. కొన్ని శ్వాస కష్టంగా ఉండటం, దగ్గు,ఛాతీ బిగుతు, శ్వాస సరిగా ఆడకపోవడం, శ్వాసలో గురక వంటి లక్షణాలు ఆస్తమా యొక్క ప్రధాన లక్షణాలు. ఆస్తమాను నివారించలేము, కానీ ఆస్తమా లక్షణాల కంట్రోల్ చేసుకోవచ్చు. ఆస్థమాను కంట్రోల్ చేసే 13 ఉత్తమ ఆహారాలు పర్యావరణ లక్షణాలు కూడా ఆస్తమాను మరింత హానికరం చేయవచ్చు. ఆస్తమాకు ఉత్తమ చికిత్స, ఆస్తమా యొక్క లక్షణాలను గుర్తించడం మరియు ఆస్తమా లక్షణాలకు కారణం అయ్యే అలర్జీను నివారించుకోవడం. ఆస్త్మా నివారించడానికి కొన్ని ఆహారాలు సహాయపడుతాయి. ఈ ఆహారాలను మన రెగ్యులర్ డైట్ నుండి మినహాయించడం ద్వారా ఆస్త్మా లక్షణాలను తగ్గించుకోవచ్చు. మరి మన డైట్ నుండి మినహాయించాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం.... గుడ్డు అలర్జీ ఉన్న వారిలో ఆస్త్మా లక్షణాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . ఈ ప్రోటీన్స్ ఆస్త్మాకు మరింత అలర్జీని కలిగిస్తాయి. మీకు ఇదివరికటికే ఆస్త్మా ఉన్నట్లైతే షెల్ ఫిష్ కు దూరంగా ఉండాలి . ఆస్త్మాకు కారణం అయ్యే అంత్య ప్రమాధకరమైన ఆహారాల్లో ఇది ఒకటి. . షెల్ ఫిష్ ను తినడం వల్ల అలర్జిక్ రియాక్షన్ కు కారణం అవుతుంది. పాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో ఎముకలు మరియు దంతాలను మరింత స్ట్రాంగ్ గా ఉంచుతాయి. అయితే ఆస్త్మా అలర్జిక్ లక్షనాలున్న వారికి ఇది ప్రమాధకరమైన ఆహారంగా భావించాలి. మిల్క్ ప్రోటీన్స్ ఆస్త్మాకు కారణం అవుతాయి. చాలా మందికి వేరుశెనగలు అలర్జీని కలిగిస్తాయి. అంతే కాదు ఈ అలర్జీ ఆస్త్మాకు కూడా కారణం అవుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడించారు. రెడ్ వైల్ లో ఉండే సల్ఫైట్ ప్రిజర్వేటివ్స్ జలుబు మరియు దగ్గుకు కారణం అయ్యి ఆస్త్మాకు దారి తీస్తుంది. అలర్జిక్ రియాక్షన్ కలిగించడంలో రెడ్ వైన్ ఒకటి. ఆల్కహాల్‌లోని అసిడ్ రిఫ్లెక్షన్ వల్ల ఆస్త్మాను మరింత తీవ్రతరం చేస్తుంది. గోధుమల్లో గులిటెన్ మరియు ప్రోటీన్ ను కనుగొనడం జరిగింది . గులిటెన్ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది . ఇది వ్యక్తిలో శ్వాస సమస్యలకు గురిచేస్తుంది. ఆస్త్మాకు కారణం అయ్యే ఆహారాల్లో సోయా ఒకటి. సోయాలో అనేక అలర్జిక్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి, అలర్జిక్ రియాక్షన్ కలిగిస్తాయి. కాబట్టి, ఆస్త్మా లక్షణాలు ఉన్నవారు ఈ ఆహారాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







