క్యాబేజీ రైస్
- October 16, 2015
కావలసిన పదార్థాలు: (సోనామసూరి) బియ్యం - ముప్పావు కప్పు, నీరు - ఒకటిన్నర కప్పు, క్యాబేజీ తురుము - 3 కప్పులు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 1, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను.
మసాల కోసం: కొబ్బరి తురుము - పావు కప్పు, జీడిపప్పులు - 10, కొత్తిమీర తరుగు - గుప్పెడు, గసగసాలు - అర టీ స్పూను, లవంగాలు - 2, దాల్చినచెక్క - అరంగుళం ముక్క, పచ్చిమిర్చి - 1 (ఇవన్నీ కలిపి ముద్దగా రుబ్బుకోవాలి)
తయారుచేసే విధానం: బియ్యంలో రెండు చుక్కల నూనె కలిపి పొడిగా అన్నం వండి పళ్లెంలో ఆరబెట్టాలి. నూనెలో పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఇంగువ వేగాక మసాల ముద్ద కలపాలి. అన్నీ వేగాక క్యాబేజీ తురుము, పసుపు, ఉప్పు వేసి కొద్ది నీరు చిలకరించి మూతపెట్టి చిన్నమంటపై ఉంచాలి. 5 నిమిషాల తర్వాత స్టౌవ్ కట్టేసి, ఆరబెట్టిన అన్నంలో కొద్దికొద్దిగా క్యాబేజి మిశ్రమం వేస్తూ అట్ల కాడతో కలపాలి. క్యాబేజి రైస్‌కు పెరుగు పచ్చడి మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







