గాయకుడిగా అవతారం ఎత్తనున్న హర్భజన్
- July 08, 2017
భారత స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ త్వరలో గాయకుడిగా అభిమానులకు పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు మిథూన్ అందించిన స్వరాలకు హర్భజన్ గొంతు సవరించనున్నాడు. ఈ ఇద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు. ఇటీవల హర్భజన్ తన పుట్టిన రోజు నాడు వచ్చిన ఆలోచనను మిథూన్‌తో పంచుకున్నాడట. మాటల మధ్యలో సంగీతం అంటే ఎంతో ఇష్టమని భజ్జీ చెప్పాడట.
దేశ సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తుల గురించి, సంప్రదాయ కళలు, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని వివరించేట్టుగా ఓ పాట రూపొందిద్దామని భజ్జీ తనతో అన్నట్లు మిథూన్ తెలిపాడు. 'గతంలోనూ ఎన్నో ఐడియాలను పంచుకున్నప్పటికీ... ఇది మాత్రమే ఇద్దరికీ బాగా నచ్చంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదటుపెడతాం. ఈ ఏడాది ఆఖర్లో ఈ పాటను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరిస్తామని, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి పాటను విడుదల చేస్తామని' మిథూన్ తెలిపాడు.
ఐపీఎల్-2017లో హర్భజన్ ముంబయి ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడిన భజ్జీ 2016లో చివరిసారిగా భారత జట్టులో కన్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై భజ్జీ కొంత అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







