'ఉంగరాల రాంబాబు'గా వస్తున్న హీరో సునీల్

- July 08, 2017 , by Maagulf
'ఉంగరాల రాంబాబు'గా వస్తున్న హీరో సునీల్

ఉంగరాల రాంబాబుగా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు సునీల్. హీరోయిన్ గా మియా జార్జ్ నటిస్తోంది. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలకు దర్శకుడిగా చేసిన క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై పరుచూరి కిరీటీ దీనిని నిర్మిస్తున్నారు. క్రాంతిమాధవ్ మేకింగ్, సునీల్ టైమింగ్ తో సినిమా ఉంటుందంటున్నారు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో ఎలాంటి జిమ్మిక్కులు చేయనుందో చూడాలి. ఈనెల చివరివారంలో ఈ సినిమా రిలీజ్ చేస్తామంటున్నారు. సునీల్ తరహా కామెడీతో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందా, లేక హీరోయిజం చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రకాష్ రాజ్, పోసాని, వెన్నెల కిషోర్, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్రలు ఈ సినిమాలో నటిస్తుండడంతో హైప్ బాగానే ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com