తగ్గిన బంగారం ధర!
- July 08, 2017
న్యూదిల్లీ: బంగారం ధర మరోసారి పడిపోయింది. వరుసగా నాలుగురోజుల పాటు తగ్గుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం తిరిగి పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం నాటి ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.28,900కి చేరింది. డాలర్ బలపడటంతో బంగారం ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారంలో పెట్టుబడి సురక్షితమైనా.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు తమ పొజిషన్లను డాలర్‌కు అనుకూలంగా మార్చుకోవడంతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. మరోపక్క అమ్మకాల ఒత్తిడితో వెండి ధర రూ.38వేల దిగువకు పడిపోయింది. శనివారం కిలో వెండి రూ.800 తగ్గి రూ.37,400లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర 1.04శాతం తగ్గి, ఔన్సు 1,221.20 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







