స్త్రీని వ్యభిచారంలోకి బలవంతంగా మళ్ళించినందుకు నలుగురికి శిక్ష
- July 09, 2017
మనామ : ఉద్యోగం ఇప్పిస్తామని.. ఆసియా దేశానికి చెందిన 27 ఓ పనిమనిషిని వ్యభిచార వృత్తిలోకి బలవంతాన ధించిన నల్గురు బంగ్లాదేశీ నయవంచకులను కోర్టు శిక్షించింది. తొమ్మిది నెలలక్రితం బహ్రెయిన్ దేశానికి పనిచేయడానికి వచ్చిన ఆమె తనకు లభించే వేతనం పట్ల అసంతృప్తిగా ఉండేది.. ఆమె తన దేశంకు తిరిగి వెళ్లిపోవాలని యోచించింది. కానీ, ఆమెను ఇక్కడకు తీసుకొచ్చిన కంపెనీ పెద్ద మొత్తంలో నగదు చెల్లించి వెళ్లాలని సూచించింది . దాంతో గతంలో మాదిరిగానే పలువురు ఇళ్లలో పనులు చేయడానికి కుదిరింది. బాగా డబ్బులు వచ్చే పనిలో పెడ్తామని నచ్చిన పనులను తీసుకువెళుతున్నట్లు నమ్మించిన నల్గురు బంగ్లాదేశీ నిందితులు ఆ మహిళనుమోసం చేశారని కోర్టు తెలిపింది. మొట్టమొదటి ప్రతివాది, ఆమెకు బాగా వేతనం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తానని వాగ్దానం చేశాడు, అందుకు బదులుగా ఆమెను ఒక వేశ్యాగృహంతో నిర్బంధించారు. ఆమె కోర్టుకు వివరించిన ప్రకారం, మొట్టమొదటి ప్రతివాది ఆమెను శారీరకంగా ఉపయోగించుకొని తర్వాత ఆమెని వ్యభిచార వృత్తికి పంపించాడు. "మొదటి ప్రతివాది ఆ మహిళ వద్దకు కోరిక తీర్చుకొనేందుకు వచ్చిన విటుల నుండి డబ్బు సేకరించేవాడని , రెండవ మరియు మూడవ ముద్దాయిలు తమ వద్ద అమ్మాయి ఉందంటూ పలు ప్రాంతాల నుంచి ఖాతాదారులను ఆమె వద్దకు తీసుకువచ్చేవారు..అధేవిధంగా ఆ మహిళ తప్పించుకోకుండా ఉండేందుకు నాల్గవ ప్రతివాది ఆమె ఉంటున్న భవనంకు కాపలా కోసం వినియోగించేవారని అల్ మాలికీ ఒక ప్రకటనలో వివరించారు. బాధితురాలు" తాను యజమానుల నుండి పారిపోయాను. బంగ్లాదేశ్ నిందితులు నన్ను ముహారక్ లో ఒక అపార్ట్మెంట్ లో దాచేరు తీసుకువెళ్లారు, అక్కడ నన్ను 12 బెహెరిన్ దినార్లకు ఎందరో అపరిచిత వ్యక్తులతో కలిసి వ్యభిచారం చేయించేవారు. మొదట్లో నేను నిరాకరించాను మరియు నా దేశం రాయబార కార్యాలయానికి నన్ను తీసుకెళ్లమని వారిని కోరాను. అయితే, వారు నా అభ్యర్థనను తిరస్కరించారు. నేను అపార్ట్మెంట్లో దాదాపు నాలుగు నెలలు ఉన్నాను, ప్రతి రోజు నా దగ్గరకు ముగ్గురు విటులు నుంచి పదిమంది వరకు వచ్చేవారని వారు పెట్టె హింసకు ఎంతో బాధపడినట్లు అని బాధితురాలు న్యాయవాదులతో చెప్పింది. బంగ్లాదేశీ నిందితులు ఆ మహిళ అపార్ట్మెంట్ నుంచి తప్పించుకొని తనను మోసం చేసిన బంగ్లాదేశీ నిందితులపై పోలీసులకు పిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







