విడుదలకు సిద్ధం గా ఉన్న నయనతార 'వాసుకి'
- July 09, 2017
శ్రీరామ్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సినిమా 'వాసుకి'. నయనతార టైటిల్ పాత్రలో నటించింది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన 'పుదియనియమం' సినిమాకు తెలుగు అనువాదమే 'వాసుకి'. ఈ సినిమా ట్రైలర్, పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సినిమా ట్రైలర్, సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. డబ్బింగ్ సినిమాలకైనా, రెగ్యులర్ సినిమాలకైనా మంచి కథ, మంచి సంగీతం, కథను చక్కగా తెరకెక్కింగల దర్శకుడు అవసరం. ఈ మూడు అంశాలు ఈ సినిమాకు ఉన్నాయి. ప్రస్తుతం నయనతార నటిస్తోన్న ప్రతి సినిమా బ్లాక బస్టర్ రేంజ్ లో కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజై మంచి ఓపెనింగ్స్ వస్తాయిని చిత్రయూనీట్ భావిస్తోంది. ప్రతి జనరేషన్‌లో మేల్ హీరో రేంజ్‌లో ఫిమేల్ హీరోయిన్ కూడా ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి, ఇప్పుడు అనుష్క, నయనతారలున్నారు. మెయిన్ హీరోస్‌కు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ వీరిది. కాగా ఈ సినిమాతో నయన ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తోందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా జులై 21న రిలీజ్ కావాడానికి సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







