బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...
- July 09, 2017
* ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోండి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవండి. దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చౌతాయి.
* వీలైనంత ఎక్కువగా సలాడ్లు తీసుకోండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
* మీకు ఆకలి వేసినప్పుడే తినేందుకు ప్రయత్నించండి. ఆకలి లేనప్పుడు తినకండి.
* ప్యాకేజ్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
* మీరు లిఫ్ట్‌లో పై ఫ్లోర్‌లోకి వెళ్ళేటట్లైతే లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు.
* మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను సేవించండి.
* పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచింది.
* ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలుండేలా చూసుకోండి. అందులోకూడా ఎక్కువగా తినకండి. తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
* మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పని చేసేవారైతే ప్రతి రెండు గంటలకొకసారి కార్యాలయమంతా కలియ తిరగండి. అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాలపాటు నడవండి. దీంతో మీ శరీరం తేలికగా మారుతుంది.
* ప్రతి రెండు గంటలకొకసారి ఓ ఐదు నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ చేయండి. తదేకంగా గంటలకొద్ది టీవీని చూడకండి. టీవీని చూస్తూ తినడం మూలాన లావు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు.
* ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి.
* మీరు తీసుకునే టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి.
* మీరు తీసుకునే నీరు మీ శరీర బరువును నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవిస్తుండండి.
* చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకుంటుండండి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







