కాజు-బొప్పాయి ముర్జీ

- July 09, 2017 , by Maagulf
కాజు-బొప్పాయి ముర్జీ

కావలసిన పదార్థాలు : బాగా పండిన బొప్పాయి పండు - చిన్నది, పంచదార - రెండు కప్పులు, నెయ్యి - కప్పు, యాలకులు పొడి- అర చెంచా
జీడిపప్పు తురుము (పొడవుగా సన్నగా తురిమినది) - మూడు చెంచాలు బాదం తరుము - రెండు చెంచాలు, ఆరెంజ్‌ లేదా రెడ్‌ కలర్‌ - పావు చెంచా
(ఇష్టమైతేనే), మైదా - అర కప్పు, చిక్కటి పాలు - కప్పు, బాదం పప్పు ముక్కలు - చెంచా, కిస్‌మిస్‌ - 12, పచ్చి కొబ్బరి - పావు కప్పు.
తయారీ విధానం : 
ముందుగా బొప్పాయి పండు చెక్కు తీయాలి. తరువాత దానిని శుభ్రం చేసి సగానికి కోసి లోపల గింజలను పూర్తిగా తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో స్పూను నెయ్యి వేసి మైదాను మంచి వాసన వచ్చేవరకు వేయించి ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని దాంట్లో పంచదార ఒక కప్పు, నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చేవరకు ఉడికించి, కప్పు పాలు పోయాలి. పాలు రెండు నిమిషాల్లో విరిగిపోతాయి. అందులో కలర్‌, మైదా, బొప్పాయి పేస్టు, పచ్చికొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము, ముక్కలు వేసి అందులో నెయ్యి పోసి కలపాలి. తరువాత ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పైన కిస్‌మిస్‌లు అందంగా అలంకరిస్తే సరి ‘కాజు-బొప్పాయి ముర్జీ’ రెడీ అయినట్టే. ఇంకా కావాలనుకుంటే కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కూడా కట్‌ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com