హీరో బాలయ్య తమిళ డైలాగులు అదిరాయ్
- July 10, 2017
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ సినిమా అదే పేరుతో ఇప్పుడు తమిళంలోకి వెళుతుంది. తాజాగా ఈ సినిమా తమిళ ఆడియో ఆవిస్కారణ జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన బాలయ్య .. "గౌతమిపుత్ర శాతకర్ణి' ఓ ప్రాంతీయ చిత్రం కాదు. ప్రతి భారతీయుడూ చూడదగ్గ ఓ వీరుడి కథ. ఈ సినిమాను తమిళంలో మాత్రమే కాదు.. దేశంలోని అన్ని భాషల్లోనూ అనువాదం చేస్తాం" అన్నారు.
ఇంకా చెబుతూ.. తానూ తమిళబిడ్డనే అన్నారు. ఎంజీఆర్ నాకు పెదనాన్న. శివాజీ చిన్నాన్న. వీరందరి మధ్యే నేను పెరిగా. ఇక్కడికి, అక్కడికి పెద్ద తేడా ఏం లేదు. 'వీరపాండి కట్టబొమ్మన్' మాదిరిగానే 'గౌతమీపుత్ర శాతకర్ణి'. త్వరలోనే అన్ని భాషల్లో అనువాదం చేయనున్నాం" అని చెప్పారు బాలయ్య. ఈ సందర్భంగా 'వీరపాండియ కట్టబొమ్మన్'లోని డైలాగును తమిళంలో చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు బాలయ్య.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







