హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- July 11, 2017
హైదరాబాద్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లోని జంక్షన్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా తిరగలపడి ధ్వంసమైంది. ఈ ఘటనలోఒక ఫర్సత్ అలీ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు ఫర్సత్ ముఫకంజా కాలేజీలో చదువుతూ ఎమ్మెల్యేకాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని పోలీసులు అతి కష్టంమీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
నిత్యం రద్దీ ఉండే రహదారి కావడంతో ఈ ప్రమాదం కారణంగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కారులో చనిపోయిన వ్యక్తి బాగా ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చింది. ధ్వంసమైన కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన జంక్షన్‌కు ముందే ఒక మలుపు ఉండటంతోపాటు స్లోప్ మరీ ఎక్కువుంటుంది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన కారు అమాంతం వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







