ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యకతం చేసిన పలువురు సినీ ప్రముఖులు
- July 11, 2017
అమర్నాథ్ యాత్రికులపై ముష్కర మూకలు కాల్పులకు తెగబడి ఏడుగురి ప్రాణాలను బలిగొనడంపై సినీ ప్రముఖులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఉగ్రవాదుల దుశ్చర్యను పిరికిపంద చర్యగా దుయ్యబట్టారు. ఇక, బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా మాత్రం కారకులైన వారిని వెతికి మరీ చంపాలంటూ ఆక్రోషంగా ట్వీట్ పెట్టారు. ''ఇలా పిరికిపందలుగా, దొంగదెబ్బతీసి హింసకు పాల్పడడం వల్ల వారికి ఏమొచ్చింది. దీనికి కారకులైన వారిని వేటాడి చంపాలి. చనిపోయిన కుటుంబాలకు నా అశ్రు నివాళి'' అంటూ రణ్‌దీప్ హుడా ట్వీట్ చేశారు.
ఇక, ఉగ్రవాదుల దుశ్చర్యపై స్పందించిన కాజల్.. ''పిరికిపందలు. ఇదో పిరికిపంద చర్య. ఇలాంటి క్రూరానికి ఒడిగట్టిన వారిపై కోపం వస్తోంది. చనిపోయిన వారిని చూస్తే బాధేస్తోంది. బాధితుల కుటుంబాలకు నా సానుభూతి'' అంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ''అమాయకులైన అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసి మరో నీచానికి ఒడిగట్టారు. ఉగ్రవాదులపై కోపం.. బాధితులను చూస్తుంటే బాధ వేస్తున్నాయి'' అంటూ ట్వీట్ చేశారు.
యువ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ఇంకా కొంచెం ఘాటుగానే స్పందించారు. ''దమ్ముంటే ప్రత్యక్ష యుద్ధానికి రండి చూసుకుందాం.. ఎవరు గెలుస్తారో.. అమాయకుల ప్రాణాలను తీసినంత మాత్రాన మీరు పోరాడే ఉద్దేశం నెరవేరదు. ఇదో సిగ్గుమాలిన చర్య'' అంటూ తనలోని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఇక, ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని, బాధితులకు త్వరగా న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నట్టు ఫర్హాన్ అక్తర్ అన్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







