కోటి రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన సెల్ఫీ
- July 16, 2017
యువతకు సెల్ఫీ ఓ క్రేజ్. ఎక్కడంటే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కొన్నిసార్లు తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కానీ ఈ సెల్ఫీ మాత్రం దాదాపు 2లక్షల డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కొక్కటి 20వేల డాలర్ల ఖరీదు చేసే వస్తువులు ఆమె సెల్ఫీ కారణంగా ముక్కలు ముక్కలై పోయాయి.
అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ది 14 ఫ్యాక్టర్టీ ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనలో హాంకాంగ్‌కు చెందిన కళాకారుడు సిమన్ బిర్చ్ వినూత్నమైన డిజైన్లలతో తయారుచేసిన కిరీటాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శన వీక్షించేందుకు వచ్చిన ఓ యువతి వాటి ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవాలని సంబరపడింది. సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె జారి కిరీటాలు నిలబెడ్డిన స్టాండ్స్‌కు తగిలింది. ఇంకేముంది అవన్నీ ఒకదాని వెంట మరొకటి పడిపోయి పగిలిపోయాయి. వాటి ఖరీదు దాదాపు 2లక్షల డాలర్లు ఉంటుందట. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.28కోట్లు. ఆ కిరీటం ఒక్కోదాని తయారీకి 20 నుంచి 30 గంటలు పట్టిందట.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అంత ఖరీదైన వస్తువులు పగిలిపోయినా కూడా వాటిని తయారుచేసిన కళాకారుడు ఆమెను ఏమీ అనలేదు. ఇది కావాలని చేసిన పని కాదు.. ఆ యువతి పట్టుతప్పిపోయి పడటం వల్ల అవి పగిలిపోయాయి అని అన్నారు. ఆమె దగ్గర నుంచి ఎటువంటి నష్టపరిహారం కూడా తీసుకోలేదని తెలిపాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







