పారిస్ ఒప్పందంపై వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- July 16, 2017
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగిన అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్ అన్నారు. ఆదివారం ఆయన జేడీడీ అనే ఓ ప్రతికతో మాట్లాడుతూ.. పారిస్ ఒప్పందం విషయంలో ట్రంప్ తన వైఖరి మార్చుకునే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి మరికొన్ని నెలల్లో ఒక పరిష్కారాన్ని ఆలోచించి చెబుతానని ట్రంప్ చెప్పినట్లు మేక్రాన్ తెలిపారు. ఇటీవల ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇరు దేశాధ్యక్షుల మధ్య పారిస్ వాతావరణ ఒప్పందం గురించి చర్చలు జరిగాయి. పారిస్ వాతావరణ ఒప్పందంలోకి మళ్లీ వచ్చే విధంగా అన్ని సవివరంగా మాట్లాడానని మేక్రాన్ చెప్పారు.
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ నెల మొదటిలో ప్రకటించారు. 'ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమే కాదు. ఉద్యోగ కల్పననూ దెబ్బతీస్తుంది. భారత్, చైనా లాంటి దేశాలకు ఈ ఒప్పందం అనుకూలంగా ఉంది' అంటూ ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పలు దేశాధినేతలు తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి 190 దేశాలకు పైగా అంగీకరించాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







