పి.వాసు దర్శకత్వంలో హీరోయిన్ కాజల్
- July 16, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'పనక్కారన్', 'మన్నన్', 'చంద్రముఖి' వంటి పలు హిట్ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శక నటుడు పి.వాసు. ఇటీవల ఆయన లారెన్స్ హీరోగా 'శివలింగ' చిత్రాన్ని రూపొందించారు. అయితే అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను వూహించుకున్న పాత్రకు తగ్గట్టు కథానాయికను ఎంపిక చేసే పనుల్లో కొంత కాలంగా వాసు ఉన్నారు. అయితే చివరకు ఆ పాత్ర కోసం కాజల్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాజల్ అజిత్‌తో 'వివేగం', విజయ్‌తో 'మెర్సల్' చిత్రాల్లో నటిస్తోంది.
అంతేకాకుండా మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా నయనతార, అనుష్క, త్రిష లాగా కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఈ పనులు పూర్తయిన తర్వాత పి.వాసు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







