తక్కాళి రసం
- July 17, 2017
కావలసినవి
పండిన టొమాటోలు (మరీ పెద్దవి, మరీ చిన్నవి కాకుండా ఓ మాదిరిగా ఉండాలి) - మూడు, వెల్లుల్లి రెబ్బలు (నలిపి) - ఐదు, ఎండుమిర్చి - నాలుగు, పసుపు - అర టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, రసం పొడి - రెండు టేబుల్ స్పూన్లు, నల్లమిరియాల పొడి - అర టీస్పూన్, ఇంగువ - పావు టస్పూన్, కరివేపాకులు - కొన్ని, కొత్తిమీర తరుగు - కొద్దిగా, చింతపండు గుజ్జు - ఒక టేబుల్ స్పూన్, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - మూడు కప్పులు.
తయారీ విధానం
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపట మంటున్నప్పుడు స్టవ్ మంట తగ్గించాలి.
ఎండుమిర్చి, కరివేపాకులు వేసి కొన్ని సెకన్లు వేగించాలి. తర్వాత వెల్లుల్లి తరుగు, టొమాటోలు వేసి టొమాటోలు మెత్తగా అయ్యే వరకు మధ్యమధ్యలో గరిటెతో కదుపుతూ ఉడికించాలి.
మంట తగ్గించి పసుపు, కారం, రసం పొడి వేసి ఒక నిమిషం పాటు ఉడికాక పాన్‌లో కొత్తిమీర, చింతపండు గుజ్జు వేసి నీళ్లు పోయాలి, ఉప్పు కూడా వేసి స్టవ్ మంటను తగ్గించి పదినిమిషాలు నెమ్మదిగా ఉడికించాలి.
తరువాత స్టవ్ మీద నుంచి పాన్ దింపి మిరియాల పొడి, ఇంగువ వేసి కలపాలి.
రసం పొడి తయారీ:
ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మెంతులు, ఇంగువ కలిపితే రసం పొడి రెడీ అవుతుంది. లేదంటే మార్కెట్‌లో రసం పొడి కొనుక్కోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జును పావుగ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలిపి వాడొచ్చు. మరికొంచెం చింతపండు గుజ్జును అవసరం మేరకు తరువాత కలుపుకోవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్‌లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







