40 ఏళ్ల వరకు ఆడతానని చెప్పిన రోజర్ ఫెదరర్
- July 17, 2017
'ఎనిమిదో వింబుల్డన్ సాధించాలని నేను లక్ష్యంగా పెట్టుకోలేదు' వింబుల్డన్ టైటిల్ విజేతగా నిలిచిన అనంతరం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అన్న మాటలివి. ఆగస్టు 8నాటికి 36 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఫెదరర్ తనలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని స్పష్టం చేశాడు.
అంతేకాదు అంతా అనుకూలిస్తే తాను 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా టెన్నిస్‌లో కొనసాగుతానని చెప్పాడు. 'మీరు నవ్వొద్దు. నేను ఈ మాట చెబుతున్నందుకు. నేనసలు కలగనలేదు. ఏదో ఒకరోజు వింబుల్డన్ లెజెండ్ అవుతానని. కానీ, అనుకోనిది ఇప్పుడు జరుగుతున్నది. 16 ఏళ్ల క్రితం ఇక్కడ పీట్ (సంప్రాస్)ను ఓడించాక నేనింతగా విజయవంతమవుతానని అప్పుడు అనుకోలేదు' అని ఫెదరర్ అన్నాడు.
1
అది సాధ్యమేనని వాళ్లు చెప్పారు
'నాకూ అదే ఆలోచన ఉంది. ఆరోగ్యం సహకరించడంతో పాటు అన్నీ బాగుండాలి. నేను ఆరు నెలల విరామం తీసుకున్నప్పుడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ గెలవగలనా అని నా సన్నిహితులు, కోచింగ్ సిబ్బందిని అడిగాను. నేను 100 శాతం ఫిట్‌గా ఉంటే అది సాధ్యమేనని వాళ్లు చెప్పారు. గతేడాది తీసుకున్న విశ్రాంతి నేను మళ్లీ చురుగ్గా ఆడేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం నన్ను నేను చూసుకుంటే 40 ఏళ్ల వయసులో కూడా నేను ఆడుతూనే ఉంటానేమో' అని ఫెదరర్ చెప్పాడు.
2
ఎనిమిదో వింబుల్డన్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకోలేదు
'ముఖ్యంగా ఎనిమిదో వింబుల్డన్ కొట్టాలని నేను లక్ష్యంగా పెట్టుకోలేదు. టెన్నిస్ ఆడడమంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఇలాగే ఆడుతూ ఉండాలని అనుకునే వాన్ని. ఈ ఏడాది నాకు అద్భుతమనుకోవాలి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఫామ్‌లోకి రావడం, ఇలా వెంటవెంటనే గ్రాండ్‌స్లామ్స్ కొట్టడం మధురంగా ఉంది. ఆస్వాదించినంత కాలం ఆడుతూనే ఉంటా. మిమ్మల్ని ఇలా అలరిస్తూనే ఉంటాను' అని ఫెదరర్ కాస్తంత ఉద్వేగంగా చెప్పాడు.
3
వింబుల్డన్ విందుకు రాక్ స్టార్‌లా
ఇక వింబుల్డన్ విజేతగా అవతరించిన అనంతరం నిర్వహించిన వేడుకలకు ఫెదరర్ రాక్ స్టార్ లా హాజరయ్యాడు. 'అధికారిక విందు తర్వాత నేను బార్‌కు వెళ్లాను. 30-40 మంది మిత్రులతో సమయం అద్భుతంగా గడిచింది. అసలు ఏమేం చేశానో కూడా సరిగ్గా గుర్తు లేదు. వేర్వేరు రకాల మద్యం చాలా ఎక్కువగా తాగానని మాత్రం చెప్పగలను. ఉదయం ఐదు గంటలకు గానీ బెడ్ పైకి వెళ్లలేదు' అని చెప్పాడు.
4
నెంబర్ వన్ దిశగా
వరుస గ్రాండ్‌స్లామ్స్ విజయాలతో పునరుత్తేజంతో కనిపిస్తున్న స్విస్ మాస్టర్ రోజర ఫెదరర్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకునే దిశగా అడుగులేస్తున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ రెండుస్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్‌లో నిలిచాడు. 15 ఆగస్టు, 2016 తర్వాత మొదటి సారి రోజర్ టాప్ 3లోకి ప్రవేశించాడు. తాజా ప్రదర్శనతో ఫెడరర్ నవంబర్‌లో లండన్‌లో జరిగే ఏటీపీ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. అతను ఈ టోర్నీకి 15వ సారి క్వాలిఫై కావడం విశేషం. ఇక ఆండీ ముర్రే టాప్‌ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, నాదల్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక జొకోవిచ్ మూడు నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







