ఈ నెల 28న రానున్న గోపీచంద్ గౌతమ్ నందా
- July 18, 2017
మాస్ హీరో గోపిచంద్ కొత్త సినిమా గౌతమ్ నందా. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. మాస్ హీరో గోపిచంద్ సినిమా వచ్చే ఏడాదికి పైనే అయ్యింది. రిలీజ్ కి మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ అన్నింటిలోకి సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న గౌతమ్ నందా మూవీపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
సంపత్ నంది, గోపిచంద్ కాంబినేషన్లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న గౌతమ్ నందా మూవీ ఈ నెల 28న విడుదలవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్స్ సినిమాపై అంచనాలుఏర్పడేలా చేశాయి. కానీ రీసెంట్ గా వచ్చిన ధియేట్రికల్ ట్రైలర్, ఆ అంచనాలు రెట్టింపు చేసింది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గౌతమ్ నందా మూవీలో, క్యాథరిన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. మాస్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీయడంలో పేరున్న సంపత్ నంది, ఈ మూవీని కూడా అదే జానర్లో తీశాడు. గోపిచంద్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే హన్సిక, క్యాథరిన్ ల గ్లామర్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. మరి చాలా రోజుల గ్యాప్ తో వస్తున్న గోపిచంద్, గౌతమ్ నందాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







