అక్టోబర్ 12న రవితేజ రాజా ది గ్రేట్ విడుదల
- July 18, 2017
మాస్ మహారాజ్ రవితేజ సినిమా వచ్చి ఏడాదికి పైనే అయ్యింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న రవితేజ, అందులో ఒక చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి డేట్ కన్ఫామ్ చేశారు.
బెంగాల్ టైగర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ, ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రాజా ది గ్రేట్ ఒఖటి, రెండవది టచ్ చేసి చూడు. ఈ రెండు చిత్రాల్లో ముందుగా రాజా ది గ్రేట్ మూవీనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో, రవితేజ చూపులేని వ్యక్తిగా నటిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రవితేజకి జోడీగా, మెహ్రీన్ కౌర్ నటిస్తోంది.
రవితేజ, దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో, మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని, ముందుగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అక్టోబర్ 12న రాజా ది గ్రేట్ విడుదల కాబోతుంది.. ఈ మూవీపై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ చూస్తే.. సినిమాపై పాజిటివ్ ఫీల్ కలుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







