జులై 21న ప్రపంచ వ్యాప్తంగా టీమ్-5 విడుదల..!
- July 19, 2017
భారత జాతీయ క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. ఊపిరి, ప్రేమమ్, మజ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాలకు సంగీతం అందించిన గోపీ సుందర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
దర్శకుడు సురేష్ గోవింద్ మాట్లాడుతూ - ''ఈనెల 21న విడుదల కానున్న మా టీమ్-5 చిత్రం కోసం పని చేసిన వారికి, మాకు సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడికి తప్పకుండా నచ్చేలా ఉంటుంది అన్నారు. ఇప్పటికే విడుదల అయిన టీమ్ 5 చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. గోపీసుందర్ సంగీతం అందించన ఈ చిత్రం యొక్క పాటలు మధుర ఆడియో ద్వారా విడుదలై, పాటలు బాగా విజయవంతం అయ్యాయి'' అన్నారు.
టీమ్ 5 చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి గోపి సుందర్ చక్కటి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో శ్రీశాంత్, నిక్కీ మరియు పర్లీ చాల చక్కగా నటించారు. టీమ్ 5 అనేది ఐదుగురు స్నేహితులు, బైక్ రేసింగ్ పైన నడిచే కథ. ఇందులో నిక్కీ, శ్రీశాంత్ ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. శ్రీశాంత్ కి పర్లీ సోదరి గా నటిస్తుంది. శ్రీశాంత్ ఈ చిత్రంలో తన నటన, డాన్స్ లతో అదరగొట్టాడు. ఈ చిత్రం యువత ని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను." అని అన్నారు.
హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ- " ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా మరియు చిత్రం ఇంత బాగా వచ్చేలా సహకరించినందుకు చిత్ర యూనిట్ సభ్యులకి ధన్యవాదాలు. చాల ఓపికగా నాకు సహకరించిన నిర్మాత మరియు టీమ్ కి థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇస్తుంది. నాకు హైదరాబాద్ అంటే చాల ఇష్టం. ఇక్కడి అభిమానులు క్రికెటర్ గా నన్ను బాగా అభిమానించే వారు ఇప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను." అని అన్నారు.
నటీనటులు : శ్రీశాంత్, నిక్కీ గర్లాని, పర్లీ, మకరంద్ దేశ్ పాండే.రచయిత, దర్శకుడు: సురేష్ గోవింద్, నిర్మాత : రాజ్ జకారియస్, సహ నిర్మాత : అన్సార్ రషీద్, సంగీతం : గోపి సుందర్, ఛాయాగ్రహణం : సాజిత్ పురుషన్, ఎడిటర్ : దిలీప్ డెన్నిస్, ఆర్ట్ డైరెక్టర్ : సాహస బాల, కాస్ట్యూమ్ డిజైనర్: సునీత ప్రశాంత్, స్టిల్స్ : SP ఆరుకట్టు, ప్రొడక్షన్ కంట్రోలర్ : శ్యామ్ ప్రసాద్,పీఆర్వోః గాండ్ల శ్రీనివాస్.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









