మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న సోదరుడిని హతమార్చిన ఒమాని అరెస్టు
- July 20, 2017
మస్కట్: రక్త సంబంధం అనే కనికరం లేకుండా ...మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న తన సహోదరుడిని కారుతో తొక్కించి నిర్దాక్షిణ్యంగా చంపివేసిన ఓ దుర్మార్గుని రాక్షస ప్రవర్తన పట్ల యావత్ ఓమాని సమాజం అసహ్యించుకొంటుంది. ఈద్ అల్ ఫిత్ర్ యొక్క మొదటి రోజున తన సొంత సోదరుడిని కారుతో తొక్కించి చంపివేసాడు. .మౌబెలాలో కారును మానసిక ఆరోగ్యం సరిగా లేని సోదరునిపై డ్రైవింగ్ చేసి నిందితుడు దారుణంగా హత్య చేశాడు. సభ్య సమాజం విస్తుపోయే ఈ సంఘటన గురించి తెలుసుకొన్న మస్కాల్ పోలీసు విభాగం ప్రధాన కార్యాలయం వద్ద విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం నుండి ఒకటవ లెఫ్టినెంట్ అధికారి జుమ్మహ్ బిన్ అబ్దుల్లాహ్ అల క'బి మాట్లాడుతూ, తానూ ఈ కేసుని స్థానిక పోలీసు స్టేషన్ కు నివేదించినట్లు పేర్కొని , నేను ప్రమాదానికి గురైన స్థలాన్ని సందర్శించాను. కారు చుట్టూ పరిశీలించేక ఈ ప్రమాదవశాత్తు జరిగింది కాదని రక్తం గుర్తులు పరిశీలిస్తే బోధపడుతుందం ఆ అధికారి అన్నారు. మా పరిశోధనా బృందం వాహనం యజమాని గురించి వాకబు చేశారు. తన సోదరుడిని చంపినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ హత్యలో తన తండ్రి ప్రణాళిక సైతం ఉందని తాము నిర్ఘాంతపోయేలా మరో ప్రతివాదిని చూపించినట్లు తెలిపాడు. పోలీసులతో ఆ కసాయి తండ్రి మాట్లాడుతూ, తన కుమారుడు మానసిక అనారోగ్యంతో చాలాకాలం నుంచి బాధ పడుతున్నడని , అతని వలన తమ కుటుంబానికి ఓ పెద్ద భారం కాబడిందని తనకు ఉద్యోగం లేదని చెప్పారు. ఇంట్లో చికాకులు మూలంగా కన్నకొడుకుని కడతేరచినట్లు నిసిగ్గుగా తెలిపాడు. ఆ దుర్మార్గులైన తండ్రి కొడుకులపై చట్టపరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపేరు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







