" నా పెళ్లి గురించి అవన్నీ అబద్ధాలు పుకారులు నమ్మకండి " షాక్ ఇచ్చిన హీరోయిన్ సమంత
- July 21, 2017
ఈ ఏడాది అక్టోబర్ లో అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని, అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతోంది బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పెళ్లి గురించీ ఆమె పెళ్లి తరవాత తీసుకోవాల్సిన నిర్ణయాల గురించే చర్చ జరుగుతోంది. సమంత తన కెరీర్ లో అనేక సినిమాలు చేసింది బ్లాక్ బస్టర్ లూ, సూపర్ హిట్ లే కాక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద హీరోలతో ఇండస్ట్రీ హిట్ సినిమాలు కొట్టేసింది.
దూకుడు , అత్తారింటికి దారేది , జనత గ్యారేజ్ ఇలా ప్రతీ హీరో కొట్టిన ఇండస్ట్రీ హిట్ వెనకాల సమంత హీరోయిన్ గా ఉంది. అయితే పెళ్లి అవ్వగానే ఆమె ఇవన్నీ ఆపి భార్యగా సెటిల్ అవుతుందా లేక మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా అనేది ఇంకా తెలీదు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరగాలి అని తన ఏర్పాట్లలో తాను ఉన్నారు అక్కినేని నాగార్జున.
అయితే అక్టోబరు లో ఆమె పెళ్లి అయిన తరవాత దాదాపు ఆరు నెలల వరకూ షూటింగ్ లకి దూరంగా ఉంటుంది అనే రూమర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై స్పందించిన చెన్నై బ్యూటీ.. అక్టోబరు ఆరున తమ పెళ్లి వేడుక గోవాలో జరుగుతుందనన్నది నిజమేనని, అయితే అంగరంగ వైభవంగా మాత్రం జరగడం లేదని చెప్పింది.ఓ సాధారణ కుటుంబంలో జరిగే పెళ్లిలా తమ పెళ్లి జరుగుతుందని, వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు వస్తారని సమంత తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







