షార్జా విల్లా పై అంతస్థు నుంచి జారీ పడిన ఎమిరాటీ బాలిక మృతి
- July 21, 2017
విల్లా అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు జారీ పడిన ఓ 11 ఏళ్ల వయస్సు గల ఇమిరాటీ బాలిక తన గాయాల కారణంగా అపస్మారక స్థాయికి చేరుకొని రెండురోజుల తర్వాత మరణించిన విషాదకర సంఘటన స్థానికంగా చోటుచేసుకొంది. ఆ బాలిక షార్జాలోని అల్ గఫియా ప్రాంతంలో తన కుటుంబంతో నివసించే విల్లా పై అంతస్థు నుంచి జారిపోయి తీవ్ర గాయాలపాలయ్యంది. ఆ బాలిక తల్లితండ్రులు ఖ్అసిమి హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర సేవల విభాగంలో ఆ బాలికకు చేర్పించారు. ఆమెకు తలకు తీవ్రమైన గాయాలు కావడంతో పుర్రె భాగం నుంచి అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. రెండు రోజుల అనంతరం ఆ బాలిక మృతి చెందింది. ఆసుపత్రి వర్గాలు బాలిక మరణ వార్తను వాసిట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎ ఎ ఎ గా గుర్తించబడిన ఆ బాలికను ఒక అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు వైద్యులు పోలీసులకు నివేదించారు. ఆ బాలికను శుక్రవారం సాయంత్రం ఖననం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







