చికెన్ ఖాస్
- July 21, 2017కావలసినవి: ఒక కేజీ కోడి, 150 గ్రాముల వెన్న, పావుకేజీ ఉల్లిపాయలు, రెండు మూడు స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల టమోటా కెచప్, పావుకేజీ తాజా క్రీమ్, తగినంత ఉప్పు
ఎలా చేయాలి
చికెన్‌ను పెద్ద ముక్కలుగా కోసుకుని కడిగి పెట్టుకోండి. దానిలో రెండు కప్పుల నీళ్ళు, ఉప్పు వేసి ఉడికించండి. ఉడికాక మిగిలిన నీళ్ళను పక్కన తీసి పెట్టుకోండి. కడాయిని పొయ్యి మీద పెట్టి వెన్నవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొత్తం వేసి వేగించండి. సగం పక్కన పెట్టి మిగతా సగంలో చికెన్, కారం, టమోటా కెచప్ వేయండి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి మిగిలిన చికెన్ నీళ్ళలో క్రీం కలిపి దానిలో వేయండి. పక్కన పెట్టిన వేగించిన ఉల్లిపాయల్ని కూరమీద చల్లండి. దీన్ని నాన్లు, పరోటాలతో కలిపి తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..