డ్రగ్స్ కేసులో పట్టు బడ్డ హీరోయిన్ కాజల్ మేనేజర్

- July 24, 2017 , by Maagulf
డ్రగ్స్ కేసులో పట్టు బడ్డ హీరోయిన్ కాజల్ మేనేజర్

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాప్ హీరోయిన్ కాజల్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోజో రోని పై వస్తున్న వార్తల నేపథ్యంలో పోలీసులు దృష్టి సారించారు.  సమాచారం అందుకున్న పోలీసులు  రోనీ ఇంటిపై దాడులు జరపగా అతని ఇంట్లో కొంత గంజాయి పట్టుబడింది.  అయితే చాలాకాలం నుంచి రోనీ డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయం వైద్య పరీక్షల్లో నిర్ధారణ జరగాల్సి ఉంది. రోనీ, మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠీ వద్ద కూడా మేనేజరుగా పని చేశారట.  ఈ వ్యవహారంపై పోలీసులు రోనిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిజానిజాలు నిర్థారించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com