మలిద లడ్డులు

- July 26, 2017 , by Maagulf
మలిద లడ్డులు

కావలసినవి: గోధుమపిండి - ఒకకప్పు, నూనె - మూడు టీస్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, యాలకులపొడి - పావు టీస్పూన్‌, బెల్లం తురుము - అరకప్పు, నెయ్యి - రెండు టీస్పూన్లు, సోంపు గింజల పొడి - పావు టీస్పూన్‌, గోధుమపిండి - పావు కప్పు (పిండి అద్దడానికి), నెయ్యి - రెండు టీస్పూన్లు.
తయారీ:
పిండిముద్ద మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండొద్దు. చపాతీ పిండిలా కలపాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నాలుగు భాగాలుగా చేయాలి. మామూలు చపాతీల్లా కాకుండా కొంచెం మందంగా వత్తి వాటిని ఓ మాదిరిగా కాల్చాలి. 
చపాతీలు చల్లారాక ముక్కలు చేసి మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి. ఇందులో బెల్లం తురుము, సోంపు గింజల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఈ పిండిని లడ్డుల్లా చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com