హంపీలో సినీ నటుడు హీరో అల్లు అర్జున్ సందడి
- August 04, 2017
తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ శుక్రవారం హంపీలో సందడిచేశారు. ఉదయం కుటుంబ సభ్యులతో సహా హంపీ చేరుకున్న ఆయన తొలుత విరూపాక్షేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన అల్లు కుటుంబం కమల్‌మహల్, రాతిరథం, విజయవిఠల ఆలయాలను సందర్శించారు. వారు వెళ్లిన ప్రతిచోట అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. కొందరు చిత్రాలు తీసుకున్నారు. అభిమానులు భారీగా గుమికూడడంతో మధ్యలోనే స్మారకాల సందర్శన రద్దు చేసుకుని హొసపేటెలోని ఓ హోటల్‌కు వచ్చి బస చేశారు. శనివారం మరికొన్ని స్మారకాలను చూసే అవకాశం ఉందని హంపీ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







