అరటిపండు చేయు మేలు

- August 05, 2017 , by Maagulf
అరటిపండు చేయు మేలు

ఏడాది పొడవునా లభించే అరటి పండు శరీరానికి అమృతతుల్యమే. పోషకాలకు అది పెట్టని కోట. ఒక్క అరటి పండు దాదాపు 100 కేలరీల శక్తినిస్తుంది. ఇందులోని పోషకాలను గమనిస్తే....

పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌, మాంగనీసు, వంటి ఖనిజాలతో పాటు ఇనుము, జింక్‌, ఫోలిక్‌ ఆమ్లాలు కూడా శరీరానికి అవసరమైన పరిమాణంలో లభిస్తాయి. అరటి పండు తిన్నప్పుడు అందులోని ట్రిఫ్టోఫన్‌ అనేది అమినో సెరటోనిన్‌గా మారుతుంది. ఫలితంగా శరీరంలో ఒత్తిడి తగ్గి మనసుకు సాంత్వన లభిస్తుంది.

ఇందులోని ఐరన్‌ హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది. పెద్దపేగుకు మేలు చేసే ప్రోబయాటిక్‌ బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎంజైములను ఉత్పత్తి చేసి తద్వారా జీర్ణశక్తి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. అరటి పండులో ఉండే పొటాషియం, చాలా తక్కువ మోతాదులో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ పండులో చెక్కరలే కాకుండా, ప్రొటీన్లు సైతం అధికంగానే ఉంటాయి. ఒక్క అరటి పండు 3 ఆపిల్స్‌ లేదా 2 గుడ్లు లేదా అర లీటర్‌ పాలకు సమానం. 

 పాలు అరటి పండ్లను రోజూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ చెంతన ఉన్నట్లే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com