ఫిలిప్పీన్స్లో నరమేధం 32మంది హతం
- August 17, 2017
- పోలీసు కాల్పుల్లో 32 మంది మృతి
* రోడ్రిగో ప్రభుత్వంలో పెరిగిన హక్కుల ఉల్లంఘనలు
ఫిలిప్పీన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా, బులాకన్ ప్రావిన్స్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై 32మంది పౌరులను మనీలా పోలీసులు కాల్చి చంపారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యుటెర్టే బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగదారులపై కొరఢా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, మాదక ద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడుతున్న ముఠాల పట్ల పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, దాడుల్లో పట్టుబడ్డ వారిని విచారించకుండా మట్టుబెట్టడం పట్ల అంతర్జాతీయ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. రాజధాని మనీలాకు ఉత్తరం వైపున ఉన్న బులాకన్ ప్రావిన్సులో చోటు చేసుకున్న తాజా ఘటనలో 32 మంది పౌరులు మృతి చెందారు. మరో వంద మంది డ్రగ్స్ అక్రమ రవాణాదారులు అరెస్ట్ అయ్యారు. అంతేగాకుండా, ఈ దాడిలో భారీఎత్తున మత్తుపదార్థాలు, అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది జులై30 న సదరన్ సిటీ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో నగర మేయర్‌తోపాటు 16 మందిని పోలీసులు హతమార్చారు.
12 నగరాల్లో 26 యాంటీ డ్రగ్ ఆపరేషన్లు నిర్వహించినట్టు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. 3.3 మిలియన్ల జనాభా ఉండే బులాకన్ ప్రాంతంలో గత కొద్ది మాసాల్లో డ్రగ్స్ కేసులో అనేక మందిని అరెస్టు చేయడమే కాదు, నేరాలకు పాల్పడినవారిని కాల్చిచంపారు. ఫిలిప్పైన్స్‌లో గతేడాది నుంచి జులై 26 వరకు 3,451 మంది నేరస్థులు హతమయ్యారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







