మొదలైన ప్రియమణి పెళ్లి సందడి
- August 18, 2017
ప్రముఖ హీరోయిన్ ప్రియమణి ఆగష్టు 25న తాను కోరుకొన్నవాడి చేతిని అందుకోనున్నది. ప్రైవేట్ వేడుకగా జరగనున్న ప్రియమణి పెళ్లి వేడుక సందడి మొదలైంది. ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనున్నది. మెహందీ, సంగీత్, కాక్ టెయిల్ పార్టీ లతో పాటు.. వివాహం అనంతరం సినీ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ గ్రాండ్ గా జరగనున్నది. ఈవెంట్ మెనెజ్మెంట్ బిజినెస్ రంగం లో ఉన్న ముస్తఫా ఐపీఎల్ మ్యాచ్ లో ప్రియమణి కి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది.. ముస్తఫా వ్యక్తిత్వం నాకు నచ్చింది.. అందుకనే అతని ప్రేమలో పడ్డాను అని ప్రియమణి ఓ సమయంలో వెల్లడించింది.. ఈ ఐదేళ్ల వీరి రిలేషన్ లో ఎటువంటి విబేధాలు లేవని చాలా సంతోషం గా ఒకరినొకరు అర్ధం చేసుకొన్నారని టాక్.. ప్రియమణి, ముస్తఫా రాజ్ ఎంగేజ్ మెంట్ 2016 మే 27 న జరిగింది. అప్పటి నుంచీ వీరిద్దరూ కలిసే ఉంటున్నారు.. పెళ్లి అధికారికంగా జరగడం తప్ప ఎప్పటినుంచో వీరిద్దరూ భార్యాభర్తల్లానే కలిసి ఉంటున్నారు.. కాగా ప్రియమణి వివాహం అనతరం సినిమాలకు గుడ్ బై చెప్పనున్నదని టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







